అవనిగడ్డ శివారు బందలాయిచెరువు సమీపంలోని మామిడి తోటల్లో జనసేన నేత నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై మంగళవారం సాయంత్రం పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 27 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి, రెండు కార్లు, 30 మోటార్ సైకిళ్లు, 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పక్కా ప్రణాళికతో ఈ దాడులు నిర్వహించారు.