అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చదువు ద్వారానే స్త్రీలు సమాజంలో గౌరవంగా జీవించగలరని గుర్తించి సావిత్రిబాయి పూలే ఎంతో శ్రమించారని తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.