అవనిగడ్డ నియోజకవర్గ అపరిష్కృత సమస్యలపై డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలపై డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారని తెలిపారు.