అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం సాయంత్రం అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో బయటపడిన నిజాలు దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే లడ్డు కల్తీ వ్యవహారంలో నివేదిక వస్తే చర్యలు తీసుకోకపోగా, ఇప్పుడు వైకాపా నాయకులు సిగ్గు వదిలి ప్రజలను మభ్య పెట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.