చల్లపల్లి మండలం రామానగరంలో చెరువు పక్కన ప్రధాన రహదారి (క్లబ్ రోడ్) సమస్యకు పరిష్కారం లభించింది. పల్లెపండుగ 2.0 కార్యక్రమం ద్వారా ఉపాధి పథకం నిధులు రూ. 45 లక్షలు మంజూరు అయ్యాయి. అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు డా. మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం భూమిపూజ చేశారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు క్లబ్ రోడ్లోని పాఠశాలల విద్యార్థులు, నివాసితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.