ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గురువారం దివిసీమ పర్యటనలో భాగంగా అవనిగడ్డలోని విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ వద్ద మొంథా తుపాను వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని వివరించే ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటన కోసం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీతో పాటు ఇతర అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.