ఆదివారం చల్లపల్లి బస్టాండ్ సెంటరులో ఆర్య వైశ్య యువనేత, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఉరిమి మణికాంత్, ఏటీఎం సెంటరులో జనసేన పార్టీ మండల నాయకులు అనుమకొండ పూర్ణచంద్రశేఖర్ (ప్రెస్ పూర్ణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరాలను నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమని అన్నారు. పలువురు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరారు.