చల్లపల్లి: పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే

4చూసినవారు
చల్లపల్లి: పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుళ్ల సంఘటనపై ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీసులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఘటన జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజను, కానిస్టేబుల్ పార్వతిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్