చల్లపల్లి: విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కన్నుమూత

2చూసినవారు
చల్లపల్లి: విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కన్నుమూత
చల్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూలు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బ్రహ్మశ్రీ కలబందలపాటి వీరబ్రహ్మాచారి బుధవారం విజయవాడలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన చల్లపల్లి, కోసూరు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం గా సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మాస్టారి భౌతిక కాయాన్ని కొద్దిసేపటి క్రితం కోసూరులోని స్వగృహానికి తరలించారు. రేపు కోసూరులో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్