తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఘంటసాల మండలం తెలుగురావుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పిన్నమనేని దినేష్, ఆదివారం చల్లపల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని డ్రోన్ సహాయంతో శుభ్రం చేశారు. ఎత్తైన విగ్రహం కావడంతో డ్రోన్‌తో శుభ్రం చేయడం సులభమైందని దినేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణకుమారి, మోర్ల రాంబాబు కూడా పాల్గొన్నారు.