చల్లపల్లిలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించినా, రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వర్షం ప్రజలకు చల్లదనాన్ని ఇచ్చింది.