బంటుమిల్లి సమీపంలో డబుల్ యాక్సిడెంట్లు

3చూసినవారు
బంటుమిల్లి సమీపంలో డబుల్ యాక్సిడెంట్లు
మచిలీపట్నం-కత్తిపూడి జాతీయ రహదారిపై బంటుమిల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పెందూరు సమీపంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అదే రహదారిలో నారాయణపురం రోడ్డు వద్ద తమిళనాడు నుంచి భీమవరం వైపు పండ్లు తరలిస్తున్న లారీ కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి.