శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి కురుస్తున్న పొగమంచుతో ఘంటసాల మండలంలోని 22 గ్రామాలలో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తుండగా, రహదారి సరిగా కనిపించకపోవడంతో భారీ వాహనాలు కూడా నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితితో ప్రజలు బయటకు రావడానికి కూడా కష్టపడుతున్నారు.