భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, ఘంటసాల పోలీసులు శుక్రవారం ఏక్తా దివస్ (జాతీయ సమైక్యత దినోత్సవం) వేడుకల్లో భాగంగా గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు.