ఘంటసాల మండలం గోగినేనిపాలెం గ్రామానికి చెందిన కుంపటి అనిల్ (24) అదృశ్యమైనట్లు ఆదివారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ ప్రతాపరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సదరు యువకుడు చామనఛాయ కలర్, ఎత్తు 5. 6 ఉంటాడని, పెయింట్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. ఈ నెల 1 నుంచి కనిపించటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ఈ క్రింది నెంబర్ 9440796472 తెలియజేయాలని ఎస్ఐ సూచించారు.