ఘంటసాల పరిధిలో భారీ వరద

2863చూసినవారు
ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. సమీపంలోని ఇటుక బట్టీల్లోకి వరద నీరు చేరింది. పాపవినాశనం వద్ద ఉన్న లంక గ్రామాల్లో మినుము పంట వరద నీటికి ముంపుకు గురైనట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. వరద ప్రవాహం మరింత కొనసాగితే వాణిజ్య పంటలకు ఇబ్బందులు ఎదురవుతాయని నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.