మంగళవారం రాత్రి కోడూరు మండలంలోని పిట్టలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ బండ పేలి శరత్ బాబుకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అవనిగడ్డ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఆస్తి, రేషన్ కార్డులు, పిల్లల స్కూల్ సర్టిఫికెట్లు కాలిపోయాయి.