కోడూరు మండలం కొత్తపాలెం పిఏసిఎస్ లో ఇన్‌వాయిస్, ఓ-ఫామ్ లేకుండా బ్లాక్ మార్కెట్ నుండి తెచ్చిన 300 కట్టల జిప్సం నిల్వలు భారీగా బయటపడ్డాయి. ఈ అక్రమ జిప్సంను గుట్టుచప్పుడు కాకుండా అమ్మాలని చైర్మన్, సెక్రటరీపై ఒత్తిడి తేవడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. చైర్మన్ రేపల్లె పిచ్చేశ్వరరావు కొద్ది రోజుల క్రితం ఈ జిప్సంను సొసైటీ గోడౌన్‌కు తరలించినట్లు సమాచారం.