కోడూరు: మినుము పొలాల్లో కోతుల బీభత్సం

9చూసినవారు
కోడూరు: మినుము పొలాల్లో కోతుల బీభత్సం
కోడూరు మండలంలోని తుంగపల్లెమ్మ గుడి సమీపంలో మినుము పంట పొలాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వందలాది కోతులు పొలాల్లోకి చొరబడి మినుము మొక్కలను పీకివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో అల్లాడుతున్న రైతులకు ఈ కోతుల దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్