కోడూరు: బీచ్ లో ఉప్పొంగిన ‘నూతనోత్సాహం’

10చూసినవారు
నూతన సంవత్సర వేళ, విజయవాడ, విజయనగరం, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి పర్యాటకులు వాహనాల్లో హంసలదీవి బీచ్‌కు తరలివచ్చారు. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో తీరం వెంబడి గురువారం సందడిగా మారింది. తిరుగు ప్రయాణంలో, పర్యాటకులు హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సముద్ర తీరం వెంబడి మెరైన్ సిబ్బంది గస్తీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్