అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో రూ. 2.70 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాణక్య గురువారం తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.