కోడూరు మండలం కృష్ణాపురం పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం వాహనాలు బారులు తీరాయి. రెండు రోజులుగా డీజిల్ కొరత ఉందన్న అవాస్తవ కథనాల నేపథ్యంలో, వాహనదారులు, ఆక్వా రైతులు డీజిల్ దొరకదన్న భయంతో అవసరం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంటుందని బంక్ నిర్వాహకులు తెలిపారు. రోజువారీ కొనుగోలు కంటే నేడు ఒకేసారి మూడు రెట్లు విక్రయాలు పెరిగాయని, అందుకే ఆయిల్ సరఫరా ఆలస్యమవుతుందని వారు వివరించారు.