కోడూరు మండల పరిధిలోని మాచవరం గ్రామంలో బలుసుపల్లి స్వరూపారాణి (39) అనే మహిళ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో, ఇంటి పక్కన వారు గమనించి, కుటుంబ సభ్యులు ఆమెను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు.