బుధవారం కోడూరు మండలంలోని లింగారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జరుగువానిపాలెం గ్రామంలో దాసరి కృష్ణకుమారి (67) అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. మోటార్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతురాలి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు.