చల్లపల్లి మండలం మంగళాపురం అంబేద్కర్ నగర్ లో గురువారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో కర్రా లక్ష్మయ్య ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు బయటకు వచ్చి కేకలు వేయడంతో, చుట్టుపక్కల ప్రజలు మంటలను అదుపు చేసి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.