మోపిదేవి: రైతులు అధికారుల సూచనలు పాటించాలి

14చూసినవారు
మోపిదేవి: రైతులు అధికారుల సూచనలు పాటించాలి
వరి పంట కోసిన రైతులు అధికారుల సూచనలు పాటించాలని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ కోరారు. ఆదివారం మోపిదేవి మండలంలో ధాన్యం కొనుగోళ్లను వెంకట్రామ్ పరిశీలించారు. మోపిదేవి వార్పు రైస్ మిల్లు వద్ద ధాన్యం కొనుగోళ్లు పర్యవేక్షిస్తున్న తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాధ్ క్షేత్ర స్థాయి పరిస్థితిని వెంకట్రామ్ కు వివరించారు. రైతులు మల్టీ పర్పస్ గోడౌన్లను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్