మోపిదేవి: గాయపడిన యువకుడు మృతి

551చూసినవారు
మోపిదేవి: గాయపడిన యువకుడు మృతి
మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్ ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన రాయన శివతేజ(18) అనే యువకుడిని వెంటనే 108లో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాల తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ శివతేజ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మరో యువకుడు నాగ జస్వంత్ ను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు.

సంబంధిత పోస్ట్