మోపిదేవిలో మంగళవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో, జలధార పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
. ప్రతిపాదనలు ఆలస్యమైతే నిధుల సాధన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికను ఖచ్చితంగా రూపొందించాలని, గ్రామ ప్రత్యేక అధికారులు కీలకంగా పని చేయాలని సూచించారు. గ్రామ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.