వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్య అభిమాన సమితి ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో, ఆయన 90వ జయంతి వేడుకలు గురువారం ఆయన స్వగ్రామమైన పెదకళ్లపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మహనీయుల పుట్టుక ద్వారానే ఏ ప్రాంతానికైనా గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.