మోపిదేవి: యువకుడి మృతదేహం లభ్యం

566చూసినవారు
మోపిదేవి: యువకుడి మృతదేహం లభ్యం
మోపిదేవి మండల పరిధిలోని కే. కొత్తపాలెం గ్రామానికి చెందిన పడమట సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి తొమ్మిదో నెంబర్ కాలువలో గల్లంతు కాగా శుక్రవారం మృతదేహం లభ్యమైనది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సుబ్రహ్మణ్యం - సుబ్బారావులు 9వ నంబర్ కాలువ వద్ద ఘర్షణ పడ్డారు. ఈ నేపథంలో సుబ్రహ్మణ్యం కాలువలో పడి గల్లంతు అయ్యాడు. మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్