మోపిదేవి: భక్తుల సందడి..!

1చూసినవారు
మోపిదేవి: భక్తుల సందడి..!
ఆదివారం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి స్వామివారి కృప కోసం ప్రార్థించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్