నాగాయలంక మండలం భావదేవరపల్లిలో కొలువైన గ్రామ దేవత శ్రీ ఉర్వేళమ్మ అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను భక్తిశ్రద్ధలతో శనివారం సమర్పించారు. గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ గణపతి అన్నపూర్ణ దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి 35 కిలోలు స్వీట్లు, అరటి గెలలు, పసుపుకుంకుమ, పట్టు వస్త్రాలతో ఆషాఢ సారెను మహిళలు ఎడ్లబండి మీద ఊరేగింపుగా ఉర్వేళమ్మ ఆలయానికి తీసుకెళ్లి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.