నాగాయలంక: వృద్ధురాలి బంగారు గొలుసును ఆగంతకుడు అపహరణ

0చూసినవారు
నాగాయలంక: వృద్ధురాలి బంగారు గొలుసును ఆగంతకుడు అపహరణ
అవనిగడ్డ మండలం తుంగలవారి పాలెం గ్రామానికి చెందిన భోగిరెడ్డి రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును ఆగంతకుడు అపహరించిన ఘటన మర్రిపాలెంలో చోటు చేసుకుంది. ఈ నెల 12వ తేదీన ఆమె తన కుమార్తెల ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఈ దొంగతనం జరిగింది. ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పారిపోయాడు. ఈ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :