నాగాయలంక: బర్రంకులలో వృద్ధుడు మృతి

4చూసినవారు
నాగాయలంక: బర్రంకులలో వృద్ధుడు మృతి
నాగాయలంక మండలంలోని గణపేశ్వరం పంచాయతీ శివారు బర్రంకుల గ్రామంలో రోహిణి కార్తె వేడి గాలులకు తోట గోపాలరావు (90) మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. కుమారుడు సుబ్బారావు వడదెబ్బతో మరణించినట్లు తెలిపారు. గణపేశ్వరం విఆర్వో పి. జయరామ్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు వడదెబ్బతో చనిపోయారని సమాచారం అందించారని, అయితే పోస్టుమార్టం తర్వాతే మరణానికి గల కారణాలు నిర్ధారణ అవుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :