నాగాయలంక: రిగ్ పాయింట్ వద్ద చెలరేగిన మంటలు

3చూసినవారు
నాగాయలంక మండలం పరిధిలోని వక్కపట్లవారిపాలెం - భావదేవరపల్లి పంట పొలాల మధ్య ఉన్న నంగేగడ్డ పాత ఓ. ఎన్. జీ. సీ రిగ్ పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రిగ్ ఉన్న ప్రాంతంలోని రైతుల పొలాలు కూడా ఉన్నాయి. వేసవి ఎండల తీవ్రత వల్ల మంటలు అంటుకున్నాయా లేక ఎవరైనా పంట పొలాల్లోని తుక్కును అంటించారా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్