నాగాయలంక: 123 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు

77చూసినవారు
నాగాయలంక: 123 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు
పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నాగాయలంక మారుతీ విద్యానికేతన్ స్కూల్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీనేత బొబ్బా గోవర్ధన్ ఆర్ధిక సౌజన్యంతో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ లిల్లి జాయ్ పాల్గొని 123 మందిని కంటి పరీక్షలు చేసి అందులో 85 మందిని కంటి అపరేషన్ కి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో
కనిగంటి నారాయణ, ప్రసన్న కుమార్, శివ, అజయ్ పాల్గొని పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్