మంగళవారం జరిగిన చంద్రగ్రహణం సందర్భంగా నాగాయలంక 4వ వార్డులో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రహణ కాలం ప్రారంభం కాగానే, ఒక ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అందులో చెక్కతో చేసిన రోకలిని నిలబెట్టారు. సాధారణంగా ఎటువంటి ఆధారం లేకుండా నిలబడని రోకలి, గ్రహణ సమయంలో నిటారుగా నిలబడటం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులకు నిదర్శనంగా నిలిచింది.