పాలకాయతిప్ప: టూరిజం బోటును అడ్డుకున్న మత్స్యకారులు

10చూసినవారు
పాలకాయతిప్ప: టూరిజం బోటును అడ్డుకున్న మత్స్యకారులు
పాలకాయతిప్ప వద్ద మత్స్యకారులు వేటకు వెళ్లే సింకు ప్రాంతంలో అటవీ శాఖ టూరిజం బోటును పెట్టవద్దని స్థానిక మత్స్యకారులు డిమాండ్ చేశారు. బుధవారం అటవీశాఖ అధికారులు అక్కడికి తీసుకువచ్చిన టూరిజం బోటును దించకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, కోడూరు ఎస్ఐ చాణిక్య సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. వివాదం తలెత్తకుండా అటవీ శాఖ అధికారుల బోటును వెనక్కి పంపించి వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్