May 19, 2026, 12:05 IST/
ఢిల్లీలో రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్
May 19, 2026, 12:05 IST
ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, మున్సిపల్ ఉద్యోగులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారంలో రెండు రోజులు, అనగా బుధ, శనివారాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నారు.