Apr 10, 2026, 18:04 IST/వేములవాడ
వేములవాడ
ఘనంగా పెద్దమ్మ తల్లి పండగ వేడుకలు
Apr 10, 2026, 18:04 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండల కేంద్రంలో ముదిరాజ్ కులబంధవుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హాజరై, బోనాల నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం నేపథ్యంలో జరిగిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు కోరుకున్నారు.