బాపులపాడు: కుమార్తెను కలిసి వస్తుండగా తీవ్ర విషాదం..!

0చూసినవారు
బాపులపాడు: కుమార్తెను కలిసి వస్తుండగా తీవ్ర విషాదం..!
బాపులపాడు మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో వేలేరు జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి. యదునందనరావు (58) మృతి చెందారు. విజయవాడలో కుమార్తెను కలిసి కారులో తిరిగి వస్తుండగా, వేలేరు బీసీ కాలనీ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న టిప్పర్‌ను ఆయన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్