కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు ఘనంగా కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి నుండి మూల కొట్టు సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.