హోలీ పండుగ వేళ విషాదం నెలకొంది. చిన్ననాటి స్నేహితులైన మోహన్ సాయి, వెంకట జోసఫ్, వినయ్ కుమార్ శుభ్రం చేసుకోవడానికి గన్నవరం మండలం చిక్కవరం కండ్రికలోని చెరువు వద్దకు వెళ్లారు. చెరువు గట్టుపై కాలు జారి ముగ్గురూ నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పదో తరగతి, ఒకరు ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు. వీరి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.