గన్నవరం మండలం బూతిమిల్లిపాడులో ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకకు వచ్చిన చిన్నారులు ఆటలాడుతూ చెరువులో జారిపడటంతో ఒక బాలుడు మృతిచెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో చిన్న అవుటపల్లికి చెందిన ఆశిష్ అనే బాలుడు మరో స్నేహితుడితో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. స్థానికులు అతన్ని బయటకు తీసినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వేడుకకు వచ్చి కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి.