గన్నవరం కూరగాయల మార్కెట్లో నాసిరకం కూరగాయలు అమ్ముతున్నారని, నాణ్యమైనవి హోటళ్లకు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వినియోగదారులు ధరలు ప్రశ్నించగా, ఎస్టేట్ అధికారి దురుసుగా సమాధానం ఇచ్చారని స్థానికులు తెలిపారు. దీనిపై పలువురు నిలదీయడంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది.