ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఆపత్కాలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా నిలుస్తోందని అన్నారు. బుధవారం తన కార్యాలయంలో, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లను ఆయన స్వయంగా అందజేశారు.