గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని అన్నారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన కొలవెంటి దాసుకు రూ. 1,60,725, కానుమోలు గ్రామానికి చెందిన శేషపు వెంకట శివగిరికి, తదితరులకు చెక్కులు అందజేశారు.