గన్నవరం: గ్రామాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర వాతావరణం

1చూసినవారు
గన్నవరం: గ్రామాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర వాతావరణం
గ్రామాల పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం రాత్రి ఆయన మండలంలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నిధులతో రూ. 9.50 లక్షలతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్‌ను ప్రారంభించారు. గ్రామంలో చెత్త సేకరణకు అవసరమైన వనరులను సమకూర్చుకోవడం అభినందనీయమని, గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన పేర్కొన్నారు.