గన్నవరం నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న రహదారులు, డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కోటంక విజయ కుమారిని కోరారు. మంగళవారం సాయంత్రం గన్నవరం కార్యాలయంలో జరిగిన సమావేశంలో, నియోజకవర్గంలోని గుంతలు పడిన రహదారుల పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.