కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను శనివారం పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికుల హాజరు, అమలు విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతతో పాటు నిర్దేశిత లక్ష్యాల మేరకు కొనసాగాలని అధికారులకు సూచించారు.